
బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో మూడు, నాలుగురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ఇవాళ, రేపు ( సెప్టెంబర్ 17, 18 ) పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది న వాతావరణ శాఖ.
తెలంగాణకు అనుకోని నున్న విదర్భ ప్రాంతంలో కొనసాగుతున్న మరో ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ఈరోజు అదిలాబాదు నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.
హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి,రంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని.. ఇంటెన్స్ స్పెల్ కారణంగా సాయంత్రం, రాత్రి సమయంలో అక్కడక్కడా జోరు వర్షం కురుస్తుందని తెలిపింది వాతావరణ శాఖ. రేపు ( సెప్టెంబర్ 18 ) వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లోద్దని సూచించింది వాతావరణ శాఖ.