మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో భారీ వర్షాలు పడ్డాయి. నిన్నంతా కురిసిన అతి భారీ వర్షానికి భోపాల్ సిటీ మొత్తం తడిసిముద్దైంది. అనేక చోట్ల వర్షపు నీరు చేరింది. కొన్ని ప్రాంతాల్లో మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోయింది. కాలియాసోట్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో… కోలార్ ఏరియా మొత్తం నీట మునిగింది. ఇళ్లలోకి నీళ్లు చేరడంతో జనం అవస్థలు పడుతున్నారు. జనం ఇళ్లపైకి ఎక్కారు. కాలువ పక్క ఉన్న ఇళ్లున్నవారికి పరిస్థితి దయనీయంగా మారింది.
