సూర్యాపేట జలమయం.. నీట మునిగిన కాలనీలు

సూర్యాపేట జలమయం.. నీట మునిగిన కాలనీలు

తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అకాల వర్షం అతలా కుతలం చేసింది. తాజాగా నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి  సూర్యాపేట జిల్లా కేంద్రం జలమయమైంది. సూర్యాపేటలోని పలు వార్డులు, పలు కాలనీలు నీట మునిగాయి. నెహ్రు నగర్, మానస నగర్ , వెంకటేశ్వర కాలనీ, గోపాలపురం, ఆర్కే గార్డెన్స్ లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. చౌదరి చెరువు వరద నీటితో నిండి పొంగిపొర్లింది. ఎస్వి డిగ్రీ కళాశాల ఆవరణ నీట మునిగింది. జిల్లా కేంద్రంలో ఉన్న ఈ కాలేజీ ఆవరణలో సుమారు మూడు ఫీట్ల మీరా వరదనీరు ప్రవహిస్తోంది. సూర్యాపేటజిల్లాలో అకాల వర్షాల పట్ల అధికారులను అప్రమత్తం చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డితో సమీక్షా సమావేశం నిర్వహించారు. రెస్క్యూ చర్యలు చేపట్టాలంటూ మున్సిపల్, రెవిన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలను కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి పరిశీలించారు. టీఆరెస్ పార్టీ శ్రేణులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 

ఇవి కూడా చదవండి: 

గుక్క తిప్పకుండా చిరంజీవి డైలాగ్ చెప్పిన విద్యార్థిని

శ్రీవల్లి పాటకు స్టెప్పులేసిన క్రికెటర్లు