హైదరాబాద్ను ముంచెత్తిన వాన

హైదరాబాద్ను ముంచెత్తిన వాన

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లో భారీగా వర్షపాతం నమోదు అవుతోంది. గచ్చిబౌలిలో అత్యధికంగా 4.5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అవ్వగా... కుత్బుల్లాపూర్ లో 1.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్ల మీదకి, ఇళ్లల్లోకి నీళ్లు వచ్చి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతోంది. వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న వేళ జీహెచ్ఎంసీ సిబ్బంది తీరుపై విమర్శలు వస్తన్నాయి. రోడ్ల మీద వర్షపు నీళ్లు నిలిచి ప్రజలు కష్టాలు పడుతుంటే జీహెచ్ఎంసీ సిబ్బంది ఏమాత్రం పట్టించుకోవడం లేదు.  

నగరంలోని పలు ప్రాంతాల్లో  నమోదైన వర్షపాతం వివరాలు

  • గచ్చిబౌలిలో 4.5 సెంటీమీటర్లు 
  • ఆర్సిపురంలో 3.8 సెంటీమీటర్లు
  • పటాన్ చేరు లో 3.1 సెంటీమీటర్లు 
  • హఫీజ్ పేటలో 2.5 సెంటీమీటర్లు 
  • మియాపూర్ లో 2.4 సెంటీమీటర్లు
  • గాజుల రామారావు 1.8 సెంటీమీటర్లు 
  • కేపీహెచ్బీలో 1.4  సెంటీమీటర్లు
  • కుత్బుల్లాపూర్ లో 1.2 సెంటీమీటర్లు