హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్ కావడంతో ఖాండ్వాలోని చంబా ప్రాంతంలో రోడ్లు, వంతెనలపై వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. రాకపోకలు నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ కిన్నౌరు భావ్ నగర్ లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 5వ నంబర్ జాతీయ రహదారిపై రాకపోకలు బందయ్యాయి.  

విరిగిపడ్డ కొండ చరియలను అధికారులు తొలగిస్తున్నారు. కొండ చరియలు విరిగిపడ్డ దృశ్యాలను జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న కొందరు వాహనదారులు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు.