ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ అలర్ట్. ...5 రోజుల పాటు భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్  ప్రజలకు బిగ్ అలర్ట్. ...5 రోజుల పాటు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురవబోతున్నాయి.  ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని  వాతావరణ శాఖ అంచనా. రాష్ట్రంలో మెరుపులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. . మంగళవారం( సెప్టెంబర్ 5)  నుంచి ఐదు రోజుల పాటు కోస్తా ఆంధ్రాలో మెరుపులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని   స్పష్టం చేసింది వాతావరణ శాఖ.

 ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ (NCAP), దక్షిణ కోస్తా AP (SCAP), రాయలసీమ మరియు యానాంలోని కొన్ని ప్రాంతాలలో మెరుపులు మరియు ఉరుములతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.  ఎన్‌సీఏపీ, యానాంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం  తెలిపింది.

ఈశాన్య బంగాళాఖాతం వాయుగుండం ఏర్పడి అది వాయువ్య ప్రాంతంలో సముద్ర మట్టానికి సగటున 7.6 కిలో మీటర్ల వరకు విస్తరించిందని తెలిపారు. ఇది   నైరుతి దిశగా ప్రయాణించడంతో  రానున్న 24 గంటల్లో   వాయువ్య , పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారి తెలిపారు.