నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు..ఐకేపీ కేంద్రాల్లో తడిముద్దయిన ధాన్యం..రైతుల ఆందోళన

నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు..ఐకేపీ కేంద్రాల్లో తడిముద్దయిన ధాన్యం..రైతుల  ఆందోళన

మోంథా తుఫాన్​కారణంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దాదాపు అన్ని జిల్లాల్లో తుఫాను ప్రభావంతో నష్టం వాటిల్లింది. నిజామాబాద్​ జిల్లాలో బుధవారం  రాత్రి కురిసిన వర్షాలకు జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లో  ఉంచిన ధాన్యం తడిసి ముద్దయింది. నిజామాబాద్​ రూరల్, డిచ్​పల్లి, దర్పల్లి, మోపాల్, సిరికొండ, ఇందల్వాయి, జక్రాన్​పల్లి మండలాల్లో అకాల వర్షాలు పంట పొలలాను నీట ముంచాయి. పలుచోట్ల వరదలకు  ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉంచిన ధాన్యం కొట్టుకుపోయింది. 

నిజామాబాద్​ జిల్లా భీంగల్ మండలం లోని పలు గ్రామాల్లో అకాల వర్షానికి కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఒక్క వానతో  నేలపాలు కావడంతో రైతులు 
ఆందోళన చెందుతున్నారు.  తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని విజ్ణప్తి చేస్తున్నారు.