
దేశ రాజధాని ఢిల్లీలో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వడగళ్ళ వాన కురవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. బిజీగా ఉండే రోడ్లపై భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. వడగళ్లతో రోడ్లపై ఉన్న జనం బెంబేలెత్తిపోయారు. వర్షపు నీరు రోడ్లపైనే నిలిచిపోవడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు.
ఇప్పటికే కరోనా దెబ్బకు ఢిల్లీ ప్రజలు తెగ వణికిపోతున్నారు. ఉష్ణోగ్రతలు కూడా తగ్గిపోతే వైరస్ ఇంకా వేగంగా విస్తరించే అవకాశముంటుందని భయపడిపోతున్నారు. ఇప్పటికే ఢిల్లీలో కరోనా వైరస్ కారణంగా ఒక వృద్ధురాలు మరణించిన సంగతి తెలిసిందే. దేశం మొత్తమ్మీద 83 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇద్దరు మరణించారు.