గుండాల, అశ్వారావుపేటలో కుండపోత వాన

గుండాల, అశ్వారావుపేటలో కుండపోత వాన

అశ్వారావుపేట, గుండాల, వెలుగు : జిల్లాలోని అశ్వారావుపేట, గుండాల మండలాల్లో కుండపోత వాన కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సోమవారం అశ్వారావుపేట పట్టణంలోని కురిసిన భారీ వర్షానికి దొంతికుంట ప్రైమరీ స్కూల్ ఆవరణలో వరద నీరు నిలిచిపోయింది. విద్యార్థులు బయటకు వెళ్లే అవకాశం లేక ఇబ్బందులు పడ్డారు. 

గ్రామస్తులు నీటిని బయటకు పంపించేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. భద్రాద్రికొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో ఆదివారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో గుండాలలోని లెవెల్ వంతెన పైనుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. గుండాల- కొడవటంచ మధ్య ఏడు మెలికల వాగ్ పై ఉధృతంగా వర్షం నీరు ప్రవహించడంతో నాగారం, కొడవటంచ, పాలగూడెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.