రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలు, గ్రామల్లో భానీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదు అయ్యాయి. జిల్లాల వారిగా.. కొమరం భీమ్ జిల్లాలోని కెరమెరిలో 30.5 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షం నమోదవుగా.. ఆదిలాబాద్ జిల్లాలోని పిప్పల్దారిలో 29.9 సెంటీమీటర్లు, అదే ఆదిలాబాద్ లోని శ్రీ కొండలో 28.8 సెంటీమీటర్లు, కరీంనగర్ జిల్లాలోని ఆమకొండలో 28.5, నిర్మల్ జిల్లాలోని వాద్యల్ 26.7, నిర్మల్ జిల్లాలోని లక్ష్మణ్ చందాలో 26.2, కొమరం భీం జిల్లాలోని జైనురులో 25.1, కొమరం భీం జిల్లాలోని సిరిపూర్ లో 24.8, కరీంనగర్ జిల్లాలోని గుండీలో 24 సెంటీమీటర్లు వర్షం నమోదైంది.
ఇక జగిత్యాల జిల్లాలోని గుల్లకోటలో 23.8 సెంటీమీటర్ల వాన నమోదుకాగా.. కోరుట్లలో 22.7, పెద్దపల్లి జిల్లాలోని ధర్మారంలో 22.5, మంచిర్యాల జిల్లాలోని వెలగనూరులో 22.4, నిజామాబాద్ జిల్లాలోని మెండోరాలో 22.2, పెద్దపల్లి జిల్లాలోని కనుకులలో 21.6, జగిత్యాల జిల్లాలోని బుద్దేశ్వరపల్లిలో 21.5, జగిత్యాల జిల్లాలోని వెలుగటూర్లో 21.3, జగిత్యాల జిల్లాలోని ఎండపల్లిలో 21.2, నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండలో 21.1 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షం నమోదవుగా... పెద్దపల్లి జిల్లాలోని జూలపల్లి లో 19.9 సెంటీమీటర్ల అతి భారీ వర్షం నమోదైంది.
సిటీలోనూ పలు ప్రాంతాల్లో తెలియకపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసాయి. చందానగర్లోని అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద 4.3 సెంటీమీటర్లు అమోస్తరు వర్షం నమోదవ్వగా... గాజులరామారంలోని ఉషోదయ కాలనీ పార్క్ వద్ద 3.7 సెంటీమీటర్ల మోస్తారు వర్షం కురిసింది. బాలనగర్ వద్ద 3.6 సెంటీమీటర్లు, మాదాపూర్ 3.6, మలక్పేట్ లోని బాలశెట్టి వాటర్ ట్యాంక్ వద్ద 3.5, గాజులరామారంలోని జీడిమెట్ల వద్ద 3.4, మలక్పేట్ లోని సర్దార్ మహల్ వద్ద 3.4 సెంటీమీటర్ల వాన కురిసింది.
మరోవైపు ఖైరతాబాద్ లోని గనాభవన్ వద్ద 3.2, కూకట్పల్లిలోని ఫిరోజ్ గూడా కమ్యూనిటీ హాల్ వద్ద 3.2, చార్మినార్ లోని బండి అడ్డ వద్ద 3.2, అంబర్పేట్ లోని నారాయణగూడ ఏరియాలో 3.2, జూబ్లీహిల్స్ లో 3, జూబ్లీహిల్స్ లోని శ్రీనగర్ కాలనీ ఏరియాలో 3 సెంటీమీటర్ల వర్షం పడింది. అలాగే కార్వాన్ లోని జియాగూడ రంగనాథ్ కమ్యూనిటీ హాల్ వద్ద 3, కుబ్దుల్లాపూర్ లోని మోడల్ కమ్యూనిటీ హాల్ మీద 2.9, గోషామహల్ లోని నాంపల్లి వద్ద 2.9, రామచంద్రపురంలోని డిఈఓ ఆఫీస్ బిసైడ్ సబ్ స్టేషన్ ఆర్ సి పురం వద్ద పేటలో 2.9, ఫలక్నామాలు 2.9 సెంటీమీటర్ల, ముసపెట్ లో 2.9 సెంటీమీటర్ మోస్తరు వర్షం కురవగా... మిగతా అన్ని ఏరియాల్లో కూడా తెలియకపాటి జల్లులు కురిసాయి.
