వేసవి సెలవులు ముగింపు.. తిరుమలకు పోటెత్తిన భక్తులు

 వేసవి సెలవులు ముగింపు.. తిరుమలకు పోటెత్తిన భక్తులు

తిరుపతి: వేసవి సెలవులు, వీకెండ్ హాలిడేస్ కావడంతో తిరుమల వెంకటేశ్వరుడు దర్శనానికి భక్తులు పొటెత్తారు. దీంతో కొండపై ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠ కాంప్లెక్స్ మొదలుకొని, క్యూలైన్లన్ని పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. పెద్దసంఖ్యలో వచ్చిన భక్తులతో సప్తగిరులు గోవిందనామస్మరణతో మారుమోగుతున్నాయి. సర్వదర్శనం క్యూలైన్ రికార్డ్ స్థాయిలో లేపాక్షి సర్కిల్ దాటుకొని షాపింగ్ కాంప్లెక్స్ మీదుగా రటంభగ్గీచ్చా బస్టాండ్ దాటి వరహస్వామి గెస్ట్ హౌస్ వరకు చేరింది. దీంతో గంటల తరబడి క్యూలైన్లో నిలబడలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భక్తులు. 
భక్తుల రద్దీ పెరగడంతో ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు TTD ఈఓ ధర్మారెడ్డి. రెండు రోజులపాటు రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం ఉందన్నారు. రద్దీకి అనుగునంగా భక్తులు తిరుమల పర్యటనకు ప్లాన్ చేసుకోవాలంటున్నారు. భక్తులు ఓపితో ఉండి స్వామి వారిని దర్శించుకోవాలన్నారు. భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, పాలు, కాఫీ, నీళ్లు అందిస్తున్నాం అన్నారు ధర్మారెడ్డి.