ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత... 

ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత... 

ఏప్రిల్ 9న ఉప్పల్ స్టేడియం స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రతా ఏర్పాటు చేశారు. 1500 మంది పోలీసులు, 340 సీసీ కెమెరాలు, షీ టీమ్స్, మఫ్టీ పోలీసులు, క్విక్ రియాక్షన్ టీమ్స్ తో నిఘా పెట్టారు.  బ్లాక్ లో టికెట్స్ అమ్మితే చర్యలు తప్పవని ఇప్పటికే పోలీసులు హెచ్చరించారు. మరోవైపు.. క్రికెట్ మ్యాచ్ కు వచ్చే ప్రేక్షకుల కోసం మెట్రో సేవలను పొడిగించారు. రాత్రి ఒంటి గంట వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి. సాయంత్రం 5 గంటల నుంచి ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతి ఇస్తారు.

ఉప్పల్‌ స్టేడియం వేదికగా ఇవాళ రాత్రి 7.30గంటలకు హైదరాబాద్‌ - పంజాబ్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో మెట్రో రైలు సేవలను పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాత్రి 12.30 గంటలకు చివరి రైలు నడవనుందని.. ఉప్పల్‌ ‘స్టేడియం’ స్టేషన్‌ నుంచి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రాత్రి 12.30 గంటల తర్వాత మిగతా స్టేషన్లలో ప్రయాణికులు బయటకు వచ్చేందుకు మాత్రమే అనుమతిస్తారు. మ్యాచ్‌కు రెండు గంటల ముందు నుంచి ఉప్పల్‌కు ఎక్కువ సర్వీసులు తిరుగుతాయని మెట్రో రైలు అధికారులు చెప్పారు.