హైవే అల్లాడిపోయింది : ఆరు గంటల్లో 50 వేల వెహికల్స్ ఏపీకి

హైవే అల్లాడిపోయింది : ఆరు గంటల్లో 50 వేల వెహికల్స్ ఏపీకి

హైవే.. జాతీయ రహదారి.. సహజంగా నాలుగు లైన్ల రోడ్డు.. అయినా పట్టలేదు.. కిటకిటలాడింది.. హైదరాబాద్ టూ విజయవాడ హైవే శనివారం.. జనవరి 13వ తేదీ అల్లాడిపోయింది. సంక్రాంతి సెలవులకు వీకెండ్ కలిసి రావటంతో.. శనివారం ఉదయం సిటీ నుంచి ఒక్కసారిగా బయలుదేరారు జనం.. అంతే.. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు హైవేపై అక్షరాల 50 వేల ప్రైవేట్ వాహనాలు వెళ్లాయి.. వీటిలో 90 శాతం కార్లు కావటం విశేషం.. 

సిటీ నుంచి వెళ్లే వాహనాలతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వచ్చిన వాహనాలు అన్నీ ఒకేసారి రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర హైవే ఎక్కాయి.. అక్కడి నుంచి కార్ల జాతరే అనుకోవాలి.. గతంలో చాలా సంక్రాంతి పండుగలు వచ్చినా.. ఒకే రోజు ఇంత రద్దీ ఈసారి కనిపించటం విశేషం.. దీనికి కారణం.. వీకెండ్ కలిసి రావటం.. ఆఫీసులకు, పిల్లల స్కూల్స్ కు ఒకే రోజు నుంచి సెలవులు ప్రారంభం కావటంతో.. సొంత కార్లలోని జనం.. శనివారం ఉదయం బయలుదేరారు. రాత్రి సమయంలో పొగ మంచు పడుతుండటంతో.. కార్లలో వెళ్లే వారిలో ఆల్ మోస్ట్ 90 శాతం ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య బయలుదేరారు. దీంతో హైదరాబాద్, విజయవాడ హైవే అల్లాడిపోయింది.. షేక్ అయ్యిందనే టాక్ జర్నీ చేసిన వారి నుంచి రావటం విశేషం.. 

ఇక సూర్యాపేట దగ్గర ఉన్న టోల్ గేట్ దగ్గర అయితే శనివారం మధ్యాహ్నం ఏకంగా మూడు కిలోమీటర్ల వరకు.. మూడు లైన్లలో కార్లు నిలిచిపోవటం హైవేపై ట్రాఫిక్ రద్దీని స్పష్టం చేస్తుంది.

హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారి NH-65పై  రోడ్డు నిర్మాణ పనులు  జరగడంతో  ట్రాఫిక్  జామ్ అయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.  సామార్థ్యానికి మించి వాహనాలు వస్తుండటంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.  ఏపీతో పాటు తెలంగాణ జిల్లాలకు వెళ్లేందుకు ఇదే మార్గం కావడంతో వేలాది వాహనాలు క్యూ లైన్లో ఉన్నాయి. ఎల్బీ నగర్  నుంచి వాహనాలు స్లోగా కదులుతున్నాయి.

 హైదరాబాద్  నుంచి వచ్చే వాహనాలతోపాటు ఓఆర్ఆర్ నుంచి భారీగా వాహనాలు రావడంతో హైవే రద్దీగా మారింది. ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 50 వేలకు పైగా వాహనాలు వెళ్లాయని రాచకొండ సీపీ తెలిపారు. అంబులెన్స్ లకు ఇబ్బంది కల్గకుండా కొంత వరకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.