హైదరాబాద్ లో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ లో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన వర్షం దంచి కొడుతోంది. బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, కూకట్ పల్లి,   సనత్ నగర్, ఖైరతాబాద్,  గచ్చిబౌలీ, కొండాపూర్, హైటెక్ సిటీ, పటాన్ చెరు, ఈసీఐఎల్, ఎల్బీనగర్, చర్లపల్లి ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది.  

కొన్ని చోట్ల 40 కి.మీ వేగంంతో ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తోన్నాయి. చాలా చోట్ల  రోడ్లన్నీ జలమయం అయ్యాయి.  ఎక్కడిక్కడ వాహనాలు నిలిచిపోయాయి.  భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో  వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ఇంటికి చేరాలంటే గంటల సమయం పడుతోంది.

సిటీలో మరో రెండు గంటల పాటు భారీ వర్షాలు ఉన్నందున  జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ ప్రకటించారు.   బయటకు రావొద్దంటూ నగరవాసులకు హెచ్చరిక జారీ చేశారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే..