సింగరేణి గనుల్లో భారీగా చేరిన వరద నీరు 

సింగరేణి గనుల్లో భారీగా చేరిన వరద నీరు 
  • పూర్తిగా నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో వరద నీరు భారీగా చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిపేశారు. గత ఏడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షం కారణంగా కొత్తగూడెం సింగరేణి  ఉపరితల బొగ్గు గని జీ.కె.ఓ.సీ.లోకి వరద నీరు చేరింది. .దీంతో బొగ్గు గని లో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఓబి మట్టితీత పనులు ఆగిపోయాయి. ఏడు రోజులుగా సుమారు 45 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిందని సింగరేణి అధికారులు తెలిపారు. వర్షం కారణంగా ఓపెన్ కాస్ట్ గనుల్లోకి చేరిన వరద నీటిని  విద్యుత్ మోటార్ల సహాయంతో బయటకు తోడుతున్నారు సింగరేణి సిబ్బంది.