
సుదీప్‌కి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన హీరోగా నటించిన పలు కన్నడ సినిమాలు తెలుగులోనూ విడుదలై సక్సెస్‌ని సాధించాయి. తాజాగా మరో మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. సుదీప్, అమలాపాల్ జంటగా నటించిన ‘హెబ్బులి’ చిత్రం ఆరేళ్ల క్రితం కన్నడలో హిట్‌ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో నిర్మాత సి.సుబ్రహ్మణ్యం ఆగస్టు 4న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ‘ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయి. ఆల్రెడీ కన్నడలో విడుదలై వంద కోట్ల కలెక్షన్లు సాధించింది. తెలుగులోనూ సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు. రవి కిషన్, సంపత్ రాజ్, కబీర్ దుహన్ సింగ్, రవి శంకర్ కీలక పాత్రల్లో కనిపించ నున్నారు. అర్జున్ జన్య సంగీతాన్ని అందించాడు.