
న్యూఢిల్లీ: పాకిస్తాన్ కంటే నరకానికి వెళ్లడమే బెటర్ అని ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ అభిప్రాయపడ్డారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ‘నరకాత్ లా స్వర్గ్’ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నేను నాస్తికుడిని. నా మాటలను కొందరు మెచ్చుకుంటా రు. అతివాదులు మాత్రం దూషిస్తారు. నేను నాస్తికుడినని.. నరకానికి వెళతానని కొందరు అంటారు. మరోవైపు, నేను జిహాదీనని, పాక్ వెళ్లాలని మరికొందరు అంటుంటారు. పాకిస్తానా, నరకమా..? అన్న పరిస్థితి వస్తే నేను నరకాన్నే ఎంపిక చేసుకుంటా” అని జావేద్ అక్తర్ పేర్కొన్నారు.