
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శనివారం ఆగస్టు 10, 2024న తన పుట్టినరోజు సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. తన చేతిపై ఉన్న ఓ సింబల్ ను సోషల్ మీడియా ద్వారా రివీల్ చేశాడు. అది కేవలం ఓ ముద్ర మాత్రమే కాదు..ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం స్థితికి చిహ్నం అని రాశాడు. ఇంతకీ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ఏం గుర్తు చూపించాడు.. ఇంతకీ ఆ గుర్తు ఆయన చేతిమీద ఎందుకు ఉంది.. ఎవరు వేశారు ..ఆసక్తికర విషయాల్లోకి వెళితే..
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ తన పుట్టిన రోజు సందర్భంగా ఓ ట్వీట్ చేశారు.. ఇందులో కొన్ని ఆసక్తికర, ఆలోచించపజేసే విషయాలను వెల్లడించారు. తన చేతిపై ఉన్న ముద్రను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టాడు.. ఇది తాను రాంచీ జైలు నుంచి విడుదలైనప్పుడు అధికారులు వేసిన ఖైదీ ముద్ర అని చెప్పారు. ఇది కేవలం ఓ ముద్ర మాత్రమే కాదు..దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం ఉన్న స్థితికి చిహ్నం అని చెప్పారు.
అన్యాయానికి ఇది నిదర్శనం
సోరేన్ ను జనవరి 31,2024 న మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జార్ఖండ్ సీఎంగా రాజీనామా చేశారు. దాదాపు 150 రోజులు రాంచీ జైలులో ఉన్నాడు. ఆ సమయంలో దేశంలో ప్రజాస్వామ్య పరిస్థితిని సోరెన్ ఎత్తి చూపారు.ప్రజాస్వామ్య బద్ధం ఎన్నుకోబడిన సీఎంను.. ఎలాంటి రుజువు, ఫిర్యాదు లేకుండా 150 రోజులు జైలు ఉంచారు.. ఒక సీఎంకే ఇలా జరిగితే.. సామాన్య ప్రజలు, గిరిజనులు, దళితులు, అణగారిన ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
న్యాయం పట్ల నిబద్ధత
అయితే దేశంలో అప్రజాస్వామిక పరిస్థుతులపై న్యాయం పోరాటం చేస్తానన్నారు హేమంత్ సోరేన్.. దోపిడీకి గురైన, అణగారిన, దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులు, స్థానిక ప్రజలతో సహా అట్టడుగు వర్గాల హక్కుల కోసం పోరాటం చేస్తానని సోరెన్ చరెప్పారు. వారి గుర్తింపు, సంస్కృతి , జీవన విధానంజరుగుతున్న దాడులను ఎదుర్కొవాల్సిన అవసరం, ఆయన నొక్కి చెప్పారు.