ఇకపై పాత పార్లమెంట్ హౌజ్ ను సంవిధాన్ సదన్ గా పిలవాలి: లోక్సభ స్పీకర్

ఇకపై పాత పార్లమెంట్ హౌజ్ ను సంవిధాన్ సదన్ గా పిలవాలి: లోక్సభ స్పీకర్

గతంలో పార్లమెంట్ హౌస్ అని పిలిచే భవనాన్ని ఇకపై సంవిధాన్ సదన్‌గా పిలువబడుతుందని.. ఈ విషయాన్ని  నోటిఫై చేయడం పట్ల లోక్‌సభ స్పీకర్ సంతోషం వ్యక్తం చేశారు. 

లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు మంగళవారం పాత పార్లమెంట్‌ భవనంలోని చారిత్రక సెంట్రల్‌ హాల్‌లో సమావేశమయ్యారు. పాత పార్లమెంట్ భవనాన్ని ఇప్పుడు 'సంవిధాన్ సదన్'గా పిలుస్తామని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా  ప్రకటించారు.

అంతకుముందు ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కొత్త పార్లమెంట్ భవనంలోకి వెళ్తున్నాం.. అలా చారిత్రాత్మక పాత పార్లమెంట్ భవనం వన్నె తగ్గకూడదు.. దీనిని పాత పార్లమెంట్ భవనం అని పిలవకుండా.. సంవిధాన్ దసన్ గా నామకరణం చేయాలని సూచించారు. 

ప్రధాని సూచన మేరకు స్పీకర్ ఓం బిర్లా మంగళవారం ఇకపై పాత పార్లమెంట్ భవనాన్ని సంవిధాన్ సదన్ గా పిలవాలని తెలిపారు.