వింటర్‌‌‌‌ డైట్‌‌లో ఈ ఐదు ఉండాల్సిందే

వింటర్‌‌‌‌ డైట్‌‌లో ఈ ఐదు ఉండాల్సిందే

చలికాలం మొదలైంది. సాయంత్రానికి చలి తీవ్రత పెరిగిపోతుంది. అప్పుడు షురూ అయితయి క్రేవింగ్స్‌‌. ‘వేడి వేడి పకోడి తింటే ఎంత బాగుంటుందో’. 
‘వేడిగా ఒక ఛాయ్‌‌ లేదా ఒక కాఫీ పడితే.. అబ్బా! ఆ అనుభూతే వేరు’ అనిపిస్తుంది. అలా అనుకుంటూ చలికాలంలో జంక్‌‌ఫుడ్‌‌ను ఎక్కువగా తినేస్తాం. దానివల్ల వైరల్‌‌ ఫీవర్స్‌‌, జలుబు దగ్గు లాంటివి వింటర్‌‌‌‌లోనే ఎక్కువగా వస్తాయి. అందుకే, కచ్చితంగా పోషకాలు ఉన్న ఫుడ్‌‌ తినాలని చెప్తోంది న్యూట్రిషనిస్ట్‌‌ రుజుత దివాకర్‌‌‌‌. అందుకు డైట్‌‌లో  ఈ ఐదు ఫుడ్స్‌‌ యాడ్‌‌ చేసుకుంటే వింటర్‌‌‌‌లో హెల్దీగా ఉంటారంటోంది. ఆ ఐదు ఏంటో చూద్దాం.   

చెరకు
చెరకును పాతకాలపు డీ టాక్స్‌‌ ఫుడ్‌‌ అని పిలుస్తారు. చలికాలంలో చెరకు తింటే లివర్‌‌‌‌ పనితనం మెరుగుపడుతుంది. చర్మం కూడా మెరుస్తుంది. చెరకులో విటమిన్స్‌‌, మినరల్స్‌‌ కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే, చలికాలంలో వారానికి కనీసం మూడుసార్లు చెరకు తింటే మంచిది. ఆ జ్యూస్‌‌ తాగినా కూడా లాభాలు చాలానే ఉంటాయి. 

రేగిపండ్లు

రేగిపండ్లను జుజుబి అని కూడా పిలుస్తారు. చలికాలంలో ఎక్కువగా దొరికే ఈ పండ్లు తింటే చర్మానికి మెరుపు వస్తుంది. అంతేకాకుండా ఇమ్యూనిటీని బూస్ట్‌‌ చేస్తుంది. పిల్లలకు పెడితే తరచూ జబ్బు పడకుండా ఉంటారు. 

చింతకాయ
చింతపండులో ఫైబర్‌‌‌‌ ఎక్కువగా ఉంటుంది. ఫ్యాట్‌‌ తక్కువగా ఉంటుంది. అందుకే, ఇది వెయిట్‌‌లాస్‌‌కు ఉపయోగ పడుతుంది. దాంతోపాటుగా చింతపండు తినడం వల్ల డైజెషన్‌‌ కూడా బాగా అవుతుంది. 

ఉసిరికాయ
ఉసిరికాయను ‘కింగ్‌‌ ఆఫ్‌‌ వింటర్స్‌‌’ అని పిలుస్తారు. చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్‌‌ను దూరం చేస్తుంది ఉసిరికాయ. దీంట్లో విటమిన్‌‌ సి, ఏలు పుష్కలంగా ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇమ్యూనిటీని బూస్ట్‌‌ చేసుకునేందుకు ఉసిరి కాయ తినడం మంచిది. ఉసిరికాయను చవన్‌‌ ప్రాస్‌‌, మురబ్బా, షర్బత్‌‌లా చేసుకోవచ్చు కూడా. 

నువ్వుల లడ్డూలు 
చలికాలంలో నువ్వుల లడ్డూలు తినడం వల్ల ఎముకలు, కీళ్లు బలపడతాయి. ఇవి టేస్ట్‌‌కి టేస్ట్‌‌, హెల్త్‌‌ కూడా. అందుకే, డైట్‌‌లో ఈ ఐదు యాడ్‌‌ చేసుకుని ఈ వింటర్‌‌‌‌లో ఇన్‌‌ఫెక్షన్స్‌‌కు దూరంగా ఉండొచ్చు.