
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్(Vijay) ప్రస్తుతం దర్శకుడు వెంకట్ ప్రభు(Venkat Prabhu)తో The G.O.A.T(Greatest Of All Time) అనే సినిమా చేస్తున్న విషయం తెలిసందే. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు.టైం ట్రావెల్,స్సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా రేపు బుధవారం (సెప్టెంబర్ 5న) వినాయక చవితి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఆడియన్స్ ను మెప్పించాయి. అయితే సినిమా థియేటర్లోకి వచ్చేది రేపే..కానీ, ఎక్కడ హైప్ మాత్రం క్రియేట్ చేయలేదని టాక్ వినిపిస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు..విజయ్ నటించిన రీసెంట్ ఫిలిం లియోతో పోల్చుకుంటే ది గోట్ మూవీపైన ఆడియన్స్ బజ్ తక్కువ ఉంది.
Also Read:-వరద సాయం ప్రకటించకుండానే తప్పుడు రాతలు
అయితే తెలుగు స్టేట్స్ లో మాత్రం హీరో విజయ్ కెరియర్ లోనే హైయెస్ట్ బిజినెస్..ది గోట్ మూవీపైన జరగడం విశేషం అని చెప్పుకోవాలి. ఒకసారి ది GOAT బిజినెస్ చూసుకుంటే..తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ 21 కోట్ల జరిగినాట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఒకరకంగా చెప్పాలంటే..విజయ్ కి ఉన్న స్థాయికి ఇది పెద్ద టార్గెట్ అయితే కాదు. ఏదేమైనప్పటికీ..తెలుగు స్టేట్స్ లో రూ.22 కోట్ల షేర్ ని అందుకుంటేనే GOAT మూవీ క్లీన్ హిట్ గా నిలుస్తుంది. రేపు థియేటర్లో రిలీజయ్యాక ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉండనున్నాయో దాన్ని బట్టి అంచనా వేయడం మొదలవుతోంది. అయితే, ఈ సినిమాకి మౌత్ టాక్ పాజిటివ్ ఉంటే..దళపతి విజయ్ ని ఎవ్వరు ఆపలేరు.
ఇదిలా ఉంటే విజయ్ కెరియర్ లో గత కొన్నేళ్ల నుంచి వస్తోన్న సినిమాల బిజినెస్ చూసుకుంటే..
The GOAT - 21CR
లియో - 16CR
వారసుడు - 16CR
బీస్ట్ 10CR
మాస్టర్ -8CR
విజిల్ -10.25CR
సర్కార్ - 7.50CR
ఇక విజయ్ గత చిత్రం లియో బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఇప్పుడు వస్తున్న G.O.A.T మూవీ అంతకుమించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబడుతుందని అంచనా. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని సాదిస్తుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ఈ సినిమాని తెలుగులో ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ వింగ్ 'మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి' (Mythri Distributors LLP) విడుదల చేయనున్న సంగతి తెలిసిందే
విజయ్ ది GOAT మూవీకి పోటీగా తెలుగు నుంచి మంచి కంటెంట్ సినిమాలు వస్తుండటం విశేషం. రానా సమర్పణలో నివేదా థామస్ 35 నటించిన 35 చిన్న కథ కాదు (సెప్టెంబర్ 6), రాజ్ తరుణ్ భలే ఉన్నాడే (సెప్టెంబర్ 7), లాంటి చిన్న సినిమాలు సెప్టెంబర్ 6, 7 తేదీలలో రిలీజ్ అవుతున్నాయి. కాగా శ్రీ సింహ హీరోగా మత్తు వదలరా2 (సెప్టెంబర్ 13) న వస్తోంది.