EPF Rule change: ఇకపై ఈఫీఎఫ్ నుంచి రూ.లక్ష వరకు విత్ డ్రా చేసుకోవచ్చు

EPF Rule change: ఇకపై ఈఫీఎఫ్ నుంచి రూ.లక్ష వరకు విత్ డ్రా చేసుకోవచ్చు

ఉద్యోగులకు శుభవార్త..ఇకనుంచి ఆన్ లైన్ ద్వారా మీ పీఎఫ్ ను రూ. లక్షవరకు విత్ డ్రా చేసుకోవచ్చు.ఇంతకుముందు రూ.50వేల మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది. ఫారం 68J  ద్వారా EPF కంట్రిబ్యూటర్ వైద్య ఖర్చుల కోసం అడ్వాన్స్ గా రూ. 1లక్ష వరకు దరఖాస్తు చేసుకునే అనుమతిస్తుంది. ఈఫీఎఫ్ కొత్త నిబంధనల ప్రకారం..ఉద్యోగులు తమ వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల వైద్య చికిత్స  ఖర్చుల కోసం ఇకపై రూ. 1లక్ష వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. నెల అంతకంటే ఎక్కువ 

రోజులు ఆస్పత్రిలో చికిత్ తీసుకుంటున్నా, ఆపరేషన్లు చేయించుకున్నా క్లెయిమ్ చేసుకోవచ్చు. పక్షవాతం, టీబీ, క్యాన్సర్, గుండె సంబంధిత  వ్యాధుల చికిత్స కోసం నగదును విత్ డ్రా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 

రూ.లక్షపరిమితికి లోబడి ఉద్యోగుల ఆరు నెలల బేసిక్ వేతనంతో పాటు డీఏ లేదా ఈపీఎఫ్ లో ఉద్యోగి వాటాను వడ్డీతో సహా విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇందుకోసం ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్లు లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించి దరఖాస్తు చేసుకోవచ్చు. 

68J  కింద నగదు విత్ డ్రా ఎలా చేయాలంటే.. 

  • సభ్యులు మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)  వివరాలను ఉపయోగించి EPFO పోర్టల్ కి లాగిన్ చేయాలి. 
  • KYC వివరాలు అప్ డేట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. 
  • తర్వాత మీరు పొందాలనుకుంటున్న క్లెయిట్ టైప్ ను ఎంచుకోవాలి. 
  • మీ రిజిస్టర్ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది..ఓటిపి ఎంటర్ చేయాలి. 
  • అసవరమైన డాక్యుమెంటేషన్ సమాచారాన్ని అందించి ఆన్ లైన్ క్లెయిమ్  సబ్మిట్ ప్రక్రియను పూర్తి చేయాలి.