వారసత్వ కట్టడాలను రక్షించుకోవాలి

వారసత్వ కట్టడాలను రక్షించుకోవాలి
  •      హెరిటేజ్ వాక్ ప్రోగ్రామ్​లో వేదకుమార్

హైదరాబాద్, వెలుగు: చారిత్రక వారసత్వ కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ ఎం.వేదకుమార్ అన్నారు. ఆదివారం ‘వాయిస్ ఆఫ్ హెరిటేజ్ బ్యాడ్జ్ ప్రోగ్రామ్ 2024’లో భాగంగా హెరిటేజ్ వాక్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వేద కుమార్ మాట్లాడారు. ‘‘హైదరాబాద్ చరిత్ర, వారసత్వ సంపదపై ఎన్నో ఏండ్లు పరిశోధనలు చేశాం. గుప్త సంపదలు కనుగొన్నాం.

 కొన్ని హిస్టారికల్ కట్టడాలు కూలిపోయే దశలో ఉన్నాయి. వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది’’అని అన్నారు. హైదరాబాద్​లోని హస్మత్ గంజ్ గేట్, క్లాక్ టవర్, రెసిడెన్సీ సర్జన్స్ బంగ్లా, ఇతర రెసిడెన్సీ ఏరియాల్లో హెరిటేజ్ వాక్ ప్రోగ్రామ్ నిర్వహించారు. బ్రిటిష్ కాలం నాటి వారసత్వ నిర్మాణాలను చూపిస్తూ ఈ వాక్ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆర్టిస్ట్ సతీశ్, సూర్య నారాయణ, భార్గవి, సీనియర్ ఆర్కిటెక్ట్ ఆర్.ఇందిరా స్రవంతి, నర్రా శ్వేత, వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.