నాన్నను రొమాంటిక్ సీన్స్ తగ్గించమన్నా 

నాన్నను రొమాంటిక్ సీన్స్ తగ్గించమన్నా 

పూరి జగన్నాథ్ కథ, మాటలు, స్క్రీన్‌‌ప్లే అందిస్తూ.. తన కొడుకు ఆకాష్ హీరోగా ఛార్మితో కలిసి నిర్మించిన చిత్రం ‘రొమాంటిక్’. కేతిక శర్మ హీరోయిన్. అనిల్ పాదూరి దర్శకుడు. ఈనెల 29న సినిమా విడుదలవుతున్న సందర్భంగా హీరో ఆకాష్ పూరి ఇలా ముచ్చటించాడు. 

‘మెహబూబా’ విడుదలైన ఆరు నెలలకు ఈ ప్రాజెక్ట్ మొదలైంది. ఈ మూవీ స్టోరీలోకి నేను వచ్చాను తప్ప నా కోసం ఈ కథ రాయలేదు. ఇస్మార్ట్ శంకర్, రొమాంటిక్ షూటింగ్​లు ఒకే టైమ్‌‌లో జరిగాయి. ‘ఇస్మార్ట్’ హిట్‌‌తో ‘రొమాంటిక్’ ఇంకా బాగా తీయాలనుకున్నాం. చంటిగాడు, పండుగాడు, బుజ్జిగాడు అనే పాత్రలు ఎలా గుర్తుండిపోయాయో.. ఇందులో నేను చేసిన ‘వాస్కోడిగామా’ పాత్ర అంతలా గుర్తుండిపోతుంది. స్క్రీన్‌పై రొమాన్స్ చేయడం చాలా కష్టం. ఏం చేయమన్నా చేస్తాను కానీ రొమాన్స్ కాస్త తగ్గించమని మా నాన్నను అడిగాను. ‘సినిమానే రొమాంటిక్.. ఇందులో రొమాన్స్ తగ్గించమంటావ్ ఏంట్రా’ అన్నారు. ఆ సీన్స్ వల్ల సెట్‌‌లో ఎన్నో సార్లు భయమేసింది. పారిపోదామా అనిపించింది. ట్రైలర్‌‌‌‌లో రొమాన్స్ ఎక్కువున్నా సినిమాలో యాక్షన్‌‌ సీక్వెన్స్‌‌లు, ఎమోషనల్‌‌ కంటెంట్ ఎక్కువుంటాయి. యూత్ మాత్రమే చూసే సినిమా కాదు. ఫ్యామిలీ అంతా చూసే సినిమా. రమ్యకృష్ణ గారి వల్ల సినిమా స్థాయి మారిపోయింది. ఆమెతో పని చేయడమే పెద్ద చాలెంజ్. మా ఇద్దరి మధ్య సీన్లు పోటాపోటీగా ఉంటాయి. సినిమా పూర్తయ్యే టైమ్‌‌కి లాక్‌‌డౌన్‌‌ రావడంతో రిలీజ్‌‌ ఆలస్యమైంది. దాంతో ఓటీటీకి ఇచ్చేస్తారేమో అని భయమేసింది. సినిమా చూసి నాన్నతో పాటు అందరం ఎమోషనల్ అయ్యాం. ప్రేక్షకులూ అదే ఫీలవుతారు. నా నెక్స్ట్ మూవీ ‘చోర్ బజార్’ షూటింగ్ లాస్ట్ స్టేజ్‌‌లో ఉంది. ఇదో యాక్షన్ మూవీ. నా క్యారెక్టరైజేషన్‌‌ సాలిడ్‌‌గా ఉంటుంది. కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి క్యారెక్టర్స్ రావడం హ్యాపీ. హీరోగా ఒకే జానర్‌‌కు పరిమితం కావాలనుకోవడం లేదు. నా సినిమాను మల్టీప్లెక్స్ నుంచి సింగిల్ స్క్రీన్ వరకు అందరూ చూడాలి అనుకుంటున్నాను. హీరోగా నిలబడ్డాక కచ్చితంగా డైరెక్షన్ చేస్తాను. నాకు కథ రాయడం రాదు కనుక.. మా నాన్నకే రెమ్యునరేషన్ ఇచ్చి కథ తీసుకుంటాన్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ మూవీ ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుండగా..ఒక్క అమెరికాలోనే 74 బిగ్ స్ర్కీన్లలో రిలీజ్ చేస్తున్నారు.