కేరళలో ఎస్సై అరుణ్ కుమార్  ధైర్యసాహసాలు అదుర్స్

కేరళలో ఎస్సై అరుణ్ కుమార్  ధైర్యసాహసాలు అదుర్స్

కేరళలో ఓ పోలీస్ ఇన్ స్పెక్టర్ ధైర్యసాహసాలు అందరినీ అబ్బురపరుస్తున్నాయి. ఓ వ్యక్తి  పదునైనా కత్తితో దాడి చేసేందుకు వచ్చినా వెనకడుగు వేయలేదు. కత్తి గాట్లను లెక్కచేయకుండా అతడిపై పోరాడి అదుపులోకి తీసుకున్నాడు. ఈనెల 12న సాయంత్రం 6 గంటల సమయంలో పారా సంజక్షన్ వద్ద పోలీస్ వాహనంలో సబ్ ఇన్ స్పెక్టర్ అరుణ్ కుమార్ వెళ్తున్నాడు. రోడ్డు పక్కన ఆగి ఉన్న వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో కారును రోడ్డు పక్కకు ఆపేశాడు. అతని దగ్గరకు వస్తుండగా పక్కనే ఉన్న కత్తిని తీసుకుని ఎస్సైపై దాడి చేశాడు. ఎంతో సమయస్ఫూర్తిని ప్రదర్శించిన అరుణ్ కుమార్..కత్తి వేటు నుంచి తప్పించుకుని వీరోచితంగా పోరాడి అతడిని గట్టిగా పట్టుకుని కింద పడేశాడు. ఆ సమయంలో ఇద్దరూ కింద పడిపోయారు.అక్కడే ఉన్న కొందరు పోలీసులకు సహాయం చేశారు. దీంతో నిందితుడిని పోలీస్ వాహనంలో ఎక్కించుకుని పీఎస్ కు తీసుకెళ్లారు. కత్తిదాడిలో అరుణ్ కుమార్ చేతికి ఏడు కుట్లు పడ్డాయి. ఈ వీడియోను ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్ స్వాతి లక్రా ట్విట్టర్ లో షేర్ చేశారు. కేరళ ఇన్ స్పెక్టర్ అరుణ్ కుమార్ రియల్ హీరో అంటూ ప్రశంసించారు.  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు నెటిజన్లు ఎస్సై ధైర్యసాహసాలను మెచ్చుకుంటున్నారు.