
గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా నటిస్తున్న ఆకాశ వీధుల్లో సినిమా రిలీజ్ డేట్ ఫిక్సైంది. జీ కే ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందుతున్న ఈ సినిమతో గౌతమ్ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మనోజ్ డీ జే, డా. మణికంఠ నిర్మిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్లు శుక్రవారం అనౌన్స్ చేసింది యూనిట్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందని.. త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తామన్నారు. దేవి ప్రసాద్, బాల పరాశర్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, హర్షిత గౌర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి జూడా శాండీ మ్యూజిక్ అందిస్తుండగా, విశ్వనాధ్ రెడ్డి సినిమాటోగ్రఫర్.
నటీనటులు : గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ, దేవి ప్రసాద్, బాల పరాశర్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, హర్షిత గౌర్ తదితరులు
సంగీతం : జూడా శాండీ,
కెమెరా : విశ్వనాధ్ రెడ్డి,
ఫైట్స్ : డ్రాగన్ ప్రకాష్,
సౌండ్ మిక్సింగ్ : కన్నన్ గణపతి,
నిర్మాతలు : మనోజ్ జెడి , డా. డీజే మణికంఠ
రచన, దర్శకత్వం : గౌతమ్ కృష్ణ