సూపర్ స్టార్ సినిమాలో విలన్ గా గోపిచంద్ ?

సూపర్ స్టార్ సినిమాలో విలన్ గా గోపిచంద్ ?

కెరీర్ ప్రారంభంలో తన విలనిజాన్ని పండించిన గోపిచంద్ తర్వాత హీరోగా పలు చిత్రాలతో విజయం సాధించాడు. క్లాస్, మాస్ నటనతో తెలుగు ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకుంటూ వచ్చాడు. గత కొంతకాలంగా సరైన హిట్ పడకపోవడంతో సతమతమవుతున్నాడు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ చేస్తున్నాడు. ఆ తర్వాత తేజతో ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఇంతలో ఎవరూ ఊహించని ఓ సినిమా చేస్తున్నాడంటూ ఒక వార్త బైటికొచ్చింది. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో గోపీచంద్ విలన్‌ గా నటిస్తాడనేదే ఆ వార్త. రజినీ హీరోగా తెరకెక్కుతున్న ‘అన్నాత్తే ’ చిత్రంలో గోపీచంద్‌‌ని విలన్‌ గా నటించమంటూ దర్శకుడు శివ సంప్రదించాడట. గోపీచంద్ ఓకే అన్నాడని కూడా కోలీవుడ్‌ లో చెప్పుకుంటున్నారు.

గతంలో శివ గోపీచంద్‌‌తో శౌర్యం, శంఖం సినిమాలు చేశాడు. ఆ పరిచయంతోనే అతణ్ని ఈ కోరిక కోరాడట. ఆల్రెడీ విలనీ పండించడంలో గోపీచంద్‌‌ టాలెంట్ తెలుసు కనుక అతని ఆలోచన కరెక్టేనని చెప్పొచ్చు. పైగా అతడు తమిళులకు కొత్తే మీ కాదు. విలన్‌ గా తనకు ఫుల్ మార్కులు వేయించిన ‘జయం’ తమిళ రీమేక్‌‌లో కూడా తనే నటించాడు. కాబట్టి ఓకే అన్నా అనొచ్చు. అందులోనూ రజినీ సినిమా అంటే అద్భుతమైన అవకాశం కూడాను. కాకపోతే ఇది నిజమా పుకారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఎవరైనా క్లారిటీ ఇస్తారేమో చూద్దాం!

see also: మార్చి 31 వరకు కరోనా సెలవులు

ఒక్కొక్కరు ఆరుగుర్ని కనండి