క్రైమ్‌‌ థ్రిల్లర్‌‌‌‌గా డ్రిల్‌‌ 

క్రైమ్‌‌ థ్రిల్లర్‌‌‌‌గా డ్రిల్‌‌ 

హరనాథ్ పొలిచెర్ల హీరోగా నటిస్తూ, దర్శకనిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘డ్రిల్’. కారుణ్య చౌదరి హీరోయిన్. ఈనెల 16న సినిమా విడుదలవుతున్న సందర్భంగా హరనాథ్ మాట్లాడుతూ ‘అమెరికాలో డాక్టర్‌‌ వృత్తిలో బిజీగా ఉన్నప్పటికీ, సినిమాలపై ప్యాషన్‌‌తో తెలుగులో కెప్టెన్‌‌ రాణా ప్రతాప్‌‌, టిక్‌‌ టిక్‌‌, చంద్రహాస్‌‌ లాంటి ఎనిమిది సినిమాలు తీశాను. అందులో ‘హోప్‌‌’ సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఇదొక  క్రైమ్ థ్రిల్లర్. ఇందులో నేను పోలీస్ ఆఫీసర్‌‌‌‌గా నటించాను.

అతను ఛేదించే కేసుల్లో లవ్‌‌ జిహాదీ అనేది ఒక కేసు.  అయితే ఇది కథలో కొంత భాగం మాత్రమే. ఇందులోనూ అలాంటి మెసేజ్ ఉంటుంది. ‘డ్రిల్‌‌’ అనేది ఒక ఆయుధం. ఇందులో హంతకుడు డ్రిల్లింగ్ మిషన్‌‌ వాడి అందరినీ చంపుతుంటాడు. ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తి రేపడానికి ‘డ్రిల్’ అని పెట్టాం. అందరికీ నచ్చే సినిమా అవుతుంది’ అన్నారు.