
కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఫాలోయింగ్ పెంచుకున్నాడు కార్తి. అందుకే తన ప్రతి మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజవుతోంది. తన కొత్త మూవీ ‘విరుమాన్’ కూడా రెండు భాషల్లో వస్తోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 31న విడుదల చేయనున్నట్టు రెండు నెలల క్రితమే ప్రకటించారు. ఇప్పుడు ప్రీ పోన్ చేశారు. ‘విరుమాన్’ ఆగస్టు 12నే వరల్డ్ వైడ్‌గా థియేటర్స్‌కి వచ్చేస్తాడంటూ నిన్న కొత్త డేట్‌ని అనౌన్స్ చేశారు. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే, మధ్యలో లాంగ్ వీకెండ్ కలిసొచ్చేలా ప్లాన్ చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కార్తి అన్న సూర్య నిర్మిస్తున్నాడు. ఇదో రూరల్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ. కార్తి లుక్ డిఫరెంట్‌గా అనిపిస్తోంది. దర్శకుడు శంకర్ కూతురు అదితి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్, రాజ్ కిరణ్, శరణ్య, సూరి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఇక కార్తి నటించిన ‘పొన్నియిన్ సెల్వన్’ సెప్టెంబర్ 30న, ‘సర్దార్’ అక్టోబర్ 24న రిలీజ్ అవుతున్నాయి. అంటే బ్యాక్ టు బ్యాక్ మూడు నెలల్లో మూడు సినిమాలు విడుదలవుతున్నాయి.