
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ గుమ్మికొండ(Kartikeya Gummikonda) తన నెక్స్ట్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు.సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న భజే వాయు వేగం(Bhaje Vaayu Vegam)నుంచి తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేశారు.
కొత్త దర్శకుడు ప్రశాంత్ రెడ్డి(Prashanth reddy)తో చేస్తున్న సినిమాకు సంబంధించిన టైటిల్ వీడియో రెస్పాన్స్ రాగా..తాజాగా రిలీజ్ చేసిన టీజర్ తో మరింత హైప్ పెంచేశారు మేకర్స్."ప్రతీ ఒక్కరి లైఫ్లో కొందరుంటారు,వాళ్ళకోసం ఏదైనా చేయడానికి రెడీ అవుతాం..నా లైఫ్ లో అది మా నాన్న" అంటూ హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది.ఒక ఆఫిసర్ హత్య..ఇన్వెస్టిగేషన్..రాజకీయం ఇలా ఉత్కంఠగా సాగుతూనే ఎమోషనల్ టచ్ ఇచ్చింది.
Also Read:విక్రమార్కుడు 2 స్టోరీ రెడీ..స్టేజీపై నిర్మాత రాధామోహన్ కామెంట్స్
ఇవన్నీ చూస్తుంటే కొత్త కంటెంట్ తో రేసీ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా రానుందని క్లియర్ గా అర్థమవుతోంది. మలయాళ బ్యూటీ ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రధన్ సంగీతం అందిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.