Bhaje Vaayu Vegam Trailer Review: భజే వాయు వేగం ట్రైలర్ టాక్..నాన్న ఆపరేషన్ కోసం పోరాడే కొడుకు

Bhaje Vaayu Vegam Trailer Review: భజే వాయు వేగం ట్రైలర్ టాక్..నాన్న ఆపరేషన్ కోసం పోరాడే కొడుకు

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ గుమ్మికొండ(Kartikeya Gummikonda) తన నెక్స్ట్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు.సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న భజే వాయు వేగం(Bhaje Vaayu Vegam) నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 

కొత్త దర్శకుడు ప్రశాంత్ రెడ్డి(Prashanth reddy)తో చేస్తున్న సినిమాకు సంబంధించిన టైటిల్ వీడియో, టీజర్ కు మంచి రెస్పాన్స్ రాగా..తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ తో మరింత హైప్ పెంచేశారు మేకర్స్.టీజర్ లో "ప్రతీ ఒక్కరి లైఫ్లో కొందరుంటారు, వాళ్ళకోసం ఏదైనా చేయడానికి రెడీ అవుతాం..నా లైఫ్ లో అది మా నాన్న" అంటూ హీరో చెప్పే డైలాగ్..ఇపుడు తాజాగా ట్రైలర్ చివర్లో హ్యాపీ డేస్ టైసన్ చెప్పే ఫాదర్ ఎమోషన్ డైలాగ్ ఆసక్తి కలిగిస్తున్నాయి.

ఒక ఆఫిసర్ హత్య..ఇన్వెస్టిగేషన్..రాజకీయం ఇలా ఉత్కంఠగా సాగుతూనే ఎమోషనల్ టచ్ ఇచ్చింది. అలాగే భారీ డబ్బుతో ఎస్కేప్ అయిన వ్యక్తిని వెతుకుతున్న దృశ్యాలతో ప్రారంభమయ్యే ట్రైలర్ లో  కార్తికేయ చుట్టూ ఓ వైపు విలన్ రవి శంకర్ పాత్ర భయపెడుతూ వెతకడం..మరో వైపు పోలీసులు వెంటాడటం  ఇలా పలు రకాల సమస్యలతో హీరో చేసే సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో హీరోకు తమ్ముడు పాత్రలో రాహుల్ టైసన్ నటించారు. హీరోయిన్ పాత్రలో ఇశ్వర్యా మెనన్ కూడా ట్రైలర్ లో అక్కడక్కడా మెరిసింది.

అయితే ఈ సినిమా కథా నేపథ్యంలో "తండ్రి ఆపరేషన్ కోసం ఎలాగైనా డబ్బు తీసుకు రావాలి అనే ఆలోచనతో హీరో పెద్ద క్రైమ్ కు పాల్పడతాడనే" విషయం తెలుస్తోంది. ఇవన్నీ చూస్తుంటే కొత్త కంటెంట్ తో రేసీ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా రానుందని క్లియర్ గా అర్థమవుతోంది. మలయాళ బ్యూటీ ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రధన్ సంగీతం అందిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్  నిర్మిస్తున్న ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.