
హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య వివాహ నిశ్చితార్థం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. గండిపేట్ లోని ఓ రిసార్ట్‌లో కుటుంబ సభ్యులు, మిత్రుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు. ఆగస్టులో వీరి వివాహం జరగనుంది. త్వరలోనే పెండ్లి తేదీని ప్రకటించనున్నారు. కొత్త జంటకు అభిమానులు, సినీ సెలబ్రిటీస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ‘రాజా వారు రాణి గారు’ చిత్రంలో కలిసి నటించిన ఈ జంట, ఆ సినిమా షూటింగ్ టైమ్ నుంచి ప్రేమలో ఉన్నారు.