బిగ్ బ్రేకింగ్ : షూటింగ్లో మంచు విష్ణుకు గాయాలు!.. హాస్పిటల్కు తరలింపు

బిగ్ బ్రేకింగ్ : షూటింగ్లో మంచు విష్ణుకు గాయాలు!.. హాస్పిటల్కు తరలింపు

మంచు విష్ణు (Manchu Vishnu)  డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘భక్త కన్నప్ప’(Bhakta Kannappa). ఇటీవల శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో మోహన్ బాబు నిర్మిస్తున్నారు.

మహాభారతం సీరియల్‌‌కు దర్శకత్వం వహించిన ముఖేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. న్యూజిలాండ్‌( New Zealand) లోని అద్భుతమైన లొకేషన్స్‌‌లో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు మంచు విష్ణు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..న్యూజిలాండ్‍ లో భక్త కన్నప్ప షూటింగ్ జరుగుతుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా హీరో మంచు విష్ణుకు తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. ఓ డ్రోన్ కెమెరా అదుపుతప్పి విష్ణు మీదకు రావడంతో..ఆయన చేతికి బలమైన గాయం అయినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

దీంతో భక్త కన్నప్ప టీమ్ మంచు విష్ణుని హాస్పిటల్ చేర్చగా..ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారట. తాత్కాలికంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయిందట. ఈడ్రోన్ ఘటనపై మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రముఖ సినీ ఎనలిస్ట్ రమేశ్ బాల తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ..“తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన భక్త కన్నప్ప షూటింగ్‍ న్యూజిలాండ్‍లో బిజీగా ఉన్న హీరో మంచు విష్ణు..ఓ యాక్షన్ సీక్వెన్స్ సందర్భంగా గాయపడ్డారు.

అనధికారవర్గాల సమాచారం ప్రకారం, విష్ణుపై డ్రోన్ కుప్పకూలడంతో అతడి చేతికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం షూటింగ్ నిలిచిపోయింది. అతడి గాయం గురించి మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు'.. అని రమేశ్ బాల పోస్ట్ చేశారు. దీంతో మంచు విష్ణు త్వరగా కోలుకోవాలని అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు.