మంచు విష్ణు హెల్త్ అప్డేట్పై.. ట్వీట్ చేసిన మోహన్ బాబు

మంచు విష్ణు హెల్త్ అప్డేట్పై.. ట్వీట్ చేసిన మోహన్ బాబు

మంచు విష్ణు (Manchu Vishnu)  డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘భక్త కన్నప్ప’(Bhakta Kannappa). ఇటీవల శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో మోహన్ బాబు నిర్మిస్తున్నారు.

రీసెంట్ గా న్యూజిలాండ్‍ లో భక్త కన్నప్ప షూటింగ్ లో ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా హీరో మంచు విష్ణుకు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై హీరో మోహన్ బాబు(Mohan Babu) ట్విట్టర్ లో స్పందించారు.

ప్రస్తుతం మంచు విష్ణు కోలుకుంటున్నాదాని తెలుపుతూ..విష్ణు పట్ల మీరు చూపించిన ప్రేమకు..మద్దుతకు కృతజ్ఞతలు.ఆ భగవంతుని దయతో తొందరలో కోలుకుని..త్వరలో షూటింగ్‌కి తిరిగి వస్తాడు. అందరికీ ధన్యవాదాలు..హర హర మహాదేవ్! అంటూ ట్విట్టర్ లో తెలిపారు. మంచు విష్ణు సేఫ్ గా ఉన్నాడనే న్యూస్ చెప్పడంతో..మంచు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 

Also Read:- మళ్లీ మణిరత్నం సినిమాలో అదితి రావు హైదరి

భక్త కన్నప్ప షూటింగ్ లో ఓ డ్రోన్ కెమెరా అదుపుతప్పి విష్ణు మీదకు రావడంతో..ఆయన చేతికి బలమైన గాయం కాగా ఒక్కసారిగా ఫ్యాన్స్ కంగారు పడ్డారు. కాగా..మహాభారతం సీరియల్‌‌కు దర్శకత్వం వహించిన ముఖేశ్ కుమార్ సింగ్ భక్త కన్నప్ప మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో ప్రభాస్, మోహన్ లాల్, కన్నడ శివరాజ్ కుమార్ కీలక పాత్రలు  పోషిస్తున్నారు.