మళ్లీ మణిరత్నం సినిమాలో అదితి రావు హైదరి

మళ్లీ మణిరత్నం సినిమాలో అదితి రావు హైదరి

హైదరాబాద్‌‌కు చెందిన అదితి రావు హైదరి, హిందీలో ఎక్కువ సినిమాలు చేసినప్పటికీ.. మణిరత్నం తీసిన ‘చెలియా’ తర్వాత తన ఫోకస్ సౌత్ ఇండస్ట్రీపై పడింది. సమ్మోహనం, వి, మహాసముద్రం లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. తాజాగా ఆమె ఓ తమిళ సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. అదికూడా తన ఫేవరేట్ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్‌‌లో.  కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  ‘నాయకుడు’ లాంటి కల్ట్ మూవీ తర్వాత 36 ఏళ్లకు ఈ ఇద్దరూ కలిసి వర్క్ చేస్తున్నారు. ఇటీవలే ఓపెనింగ్ కూడా జరిగింది. ఇందులోని ఓ కీలకపాత్రకు అదితి రావు హైదరిని మణిరత్నం ఫైనల్ చేసినట్టు టాక్. కమల్ హాసన్‌‌కు చెల్లెలి పాత్రలో ఆమె కనిపించనుందట. షూటింగ్‌‌కు ముందే తమిళం నేర్చుకోమని మణిరత్నం చెప్పడంతో.. ప్రస్తుతం తమిళ భాషపై పట్టు సాధించే ప్రయత్నంలో ఉందట అదితి.