చార్జింగ్ నెట్‌‌‌‌వర్క్ కోసం హీరో మోటోకార్ప్, ఏథర్ జోడీ

చార్జింగ్ నెట్‌‌‌‌వర్క్ కోసం హీరో మోటోకార్ప్, ఏథర్ జోడీ

న్యూఢిల్లీ : దేశంలో ఎలక్ట్రిక్​ టూవీలర్లకు ఇంటర్‌‌‌‌ ఆపరబుల్ ఫాస్ట్ చార్జింగ్ నెట్‌‌‌‌వర్క్ కోసం ఏథర్ ఎనర్జీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు హీరో మోటో కార్ప్ బుధవారం తెలిపింది. ఈ ఒప్పందం ద్వారా రెండు కంపెనీల ఈవీ వినియోగదారులు దేశవ్యాప్తంగా విడా, ఎథర్​ గ్రిడ్స్​.. రెండింటినీ ఉపయోగించుకోవచ్చు. ఈ జాయింట్​నెట్‌‌‌‌వర్క్​లో 1,900 ఫాస్ట్ చార్జింగ్ పాయింట్లు 100 నగరాల్లో ఉన్నాయి. ‘దేశంలో ఈ అతిపెద్ద చార్జింగ్ నెట్‌‌‌‌వర్క్ కస్టమర్‌‌‌‌లకు ఇబ్బంది లేకుండా చార్జింగ్​ సదుపాయాలను అందించడానికి చాలా దోహదపడుతుంది. 

 వేగంగా అభివృద్ధి చెందుతున్న చార్జింగ్​నెట్‌‌‌‌వర్క్ ప్రభుత్వం ఆమోదించిన కనెక్టర్-స్టాండర్డ్‌‌‌‌ను ఉపయోగించుకుంటుంది. తద్వారా ప్రస్తుత,  భవిష్యత్ కస్టమర్‌‌‌‌లు సులువుగా చార్జింగ్​ చేసుకోవచ్చు. భవిష్యత్తులో కూడా మా ఈవీలకు ఇబ్బందులు ఉండవు’  అని హీరో మోటోకార్ప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (ఎమర్జింగ్ మొబిలిటీ) స్వదేశ్ శ్రీవాస్తవ తెలిపారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇటీవల లైట్ ఎలక్ట్రిక్ కంబైన్డ్ చార్జింగ్ సిస్టమ్​ను  రూపొందించింది. ఇది తేలికపాటి ఎలక్ట్రిక్ వాహనాల కోసం భారతదేశం  మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేసిన ఏసీ, డీసీ కంబైన్డ్ చార్జింగ్ కనెక్టర్.