హీరో లాభం రూ. 825 కోట్లు.. రెవెన్యూ రూ. 8,767 కోట్లు

హీరో లాభం రూ. 825 కోట్లు.. రెవెన్యూ రూ. 8,767 కోట్లు

న్యూఢిల్లీ: హీరో మోటోకార్ప్‌‌‌‌కు ఈ ఏడాది జూన్‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో రూ.825 కోట్ల నికర లాభం వచ్చింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన ప్రాఫిట్‌‌‌‌తో పోలిస్తే ఇది 32 శాతం గ్రోత్‌‌‌‌కు సమానం. రెవెన్యూ 4.5 శాతం పెరిగి రూ.8,767.3 కోట్లుగా రికార్డయ్యింది. ఇబిటా (ట్యాక్స్‌‌‌‌, వడ్డీల చెల్లింపు కంటే ముందు ప్రాఫిట్‌‌‌‌)  ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 28 శాతం పెరిగి రూ.1,206 కోట్లుగా నమోదయ్యింది. కమొడిటీ ధరలు తగ్గడం, ఖర్చులు తగ్గించుకోవడంతో ఇబిటా మెరుగుపడిందని కంపెనీ ప్రకటించింది. 

ఉద్యోగుల వాలంటరీ రిటైర్‌‌‌‌‌‌‌‌మెంట్ స్కీమ్‌‌‌‌ (వీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌) కోసం రూ.160 కోట్లను హీరో ఖర్చు చేసింది. దీంతో ప్రాఫిట్ కొంత తగ్గింది. మెరుగైన ఆర్థిక పరిస్థితులు, కన్జూమర్‌‌‌‌‌‌‌‌ సెంటిమెంట్‌‌‌‌ పాజిటివ్‌‌‌‌గా ఉండడం వలన   రానున్న క్వార్టర్లలో కూడా ఇదే మొమెంటం కొనసాగుతుందని హీరో మోటోకార్ప్ భావిస్తోంది. కంపెనీ షేర్లు గురువారం సెషన్‌‌‌‌లో 0.81 శాతం తగ్గి రూ. 3,035 దగ్గర క్లోజయ్యాయి.