ఈడీ ముందు హీరో నవదీప్

ఈడీ ముందు హీరో నవదీప్

డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ ఇవాళ ( అక్టోబర్ 10న) ఈడీ విచారణకు హాజరయ్యారు. 2017 టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నవదీప్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.  నైజీరియన్లతో నవదీప్ కు ఉన్న పరిచయాలు, జరిగిన లావాదేవీలపై ఈడీ అధికారులు విచారిస్తున్నారు. 

Also Read :- బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు

ఇటీవల మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ ను నార్కోటిక్ పోలీసులు విచారించారు. ఈ కేసు వివరాలను తమకు ఇవ్వాలని నార్కోటిక్ పోలీసులను ఈడీ అధికారులు కోరారు. డ్రగ్స్ విక్రయాల ద్వారా లాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. 


డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాలని అక్టోబర్ 7న హీరో నవదీప్కు  నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. 2017 టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నవదీప్ కు నోటీసులిచ్చారు. గతంలో రెండు సార్లు నోటీసులిచ్చినా హాజరు కాలేదు. 

డ్రగ్స్‌‌ పార్టీ కేసులో సినీ నటుడు నవదీప్‌‌ సెప్టెంబర్ 23న యాంటీ నార్కోటిక్స్‌‌ బ్యూరో (టీన్యాబ్‌‌) విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌‌ బషీర్‌‌‌‌బాగ్‌‌లో ఎస్పీ సునీతారెడ్డి ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల టీమ్‌‌ దాదాపు ఆరు గంటల పాటు ఆయన్ను ప్రశ్నించింది. నవదీప్ తన ఫోన్ తీసుకురాకపోవడంపై ఆరా తీసింది. ఫోన్ రిపేర్ అయినట్లు నవదీప్ చెప్పడంతో.. ఇంటికి వెళ్లి తీసుకువచ్చారు. మొబైల్‌‌ను ఫార్మాట్ చేసి డేటా మొత్తం డిలీట్‌‌ చేసినట్లు గుర్తించారు.

ఫోన్‌‌ సీజ్ చేసి.. ఫోరెన్సిక్‌‌ ల్యాబ్‌‌కు పంపించి డేటా రిట్రీవ్‌‌ చేయించనున్నారు. మళ్లీ పిలిచినప్పుడు విచారణకు రావాలని నవదీప్‌‌ను ఆదేశించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న కలహర్ రెడ్డి, స్నాట్ పబ్ యజమాని సూర్య, సినిమా డైరెక్టర్‌‌ ఉప్పలపాటి‌‌ రవి సోమవారం విచారణకు హాజరుకానున్నారు.