పవర్ స్టార్ టైటిల్తో నితిన్ సినిమా.. కొత్త తమ్ముడు వచ్చేస్తున్నాడు!

పవర్ స్టార్ టైటిల్తో నితిన్ సినిమా.. కొత్త తమ్ముడు వచ్చేస్తున్నాడు!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan kalyan) హీరోగా నటించిన తమ్ముడు(Thammudu) సినిమా టైటిల్ తో తన కొత్త సినిమా స్టార్ట్ చేశాడు యూత్ స్టార్ నితిన్(Nithin). వకీల్ సాబ్(Vakeel saab) సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు వేణు శ్రీరామ్(Venu sriram) తెరకెక్కించనున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత దిల్ రాజు(Dil raju) నిర్మిస్తున్నారు. 

ఆ సంస్థలో 56వ చిత్రంగా రానున్న ఈ సినిమా.. 2023 ఆగస్టు 27న పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సంధర్బంగా నితిన్ తన ట్విట్టర్ లో.. కొన్ని టైటిళ్లతో పాటు చాలా బాధ్యతను మోసుకుని వస్తాయని ట్వీట్ చేశాడు. రక్త సంబంధం కంటే అనుబంధం బలమైనది.. కొత్త తమ్ముడు వస్తున్నాడంటూ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ పేర్కొంది. ఇక ఈ కార్యక్రమానికి దర్శకులు వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, దిల్ రాజు కుమార్తె హన్షిత తదితరులు హాజరయ్యారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు చిత్ర యూనిట్.