
కీవ్: టాయ్ డ్రోన్‌తో రష్యా కాన్వాయ్‌ను గుర్తించి వాటిని నాశనం చేయడంలో కీవ్ మిలిటరీకి 15 ఏళ్ల బాలుడు సాయం చేస్తున్నాడు. దీంతో అతన్ని హీరో ఆఫ్ ఉక్రెయిన్‌గా పిలుస్తున్నారు. డ్రోన్ ఆపరేటింగ్‌లో ఆండ్రీకి ఎంతో అనుభవం ఉంది. కీవ్‌కు దగ్గర్లో ఉంటున్న ఆండ్రీ, ఉక్రెయిన్ ఆర్మీతో కలిసి మినీ డ్రోన్ తయారుచేశాడు. డ్రోన్ ద్వారా రష్యా కాన్వాయ్‌లను గుర్తించి నాశనం చేయడంలో హెల్ప్చేస్తున్నాడు. కీవ్‌కు 23 మైళ్ల దూరంలో ఉన్న బెర్జివికా వద్ద రష్యన్ కాన్వాయ్‌ను టాయ్ డ్రోన్ ద్వారా గుర్తించి అధికారులకు సమాచారమిచ్చాడు. దీంతో ఉక్రెయిన్ రక్షణ శాఖకు ఆండ్రీ పోక్రాసా హీరో అయిపోయాడు. నిరుడు కన్జ్యూమర్ మినీ డ్రోన్ పర్చేస్ చేసి మంచి పైలెట్‌గా పేరు తెచ్చుకున్నాడని తెలుసుకుని పోక్రాసాను రక్షణ శాఖ సంప్రదించింది. సాయం చేయాలని కోరింది. ఈ–40 హైవేపై ఉన్న కీవ్, జైట్మైర్వెంట ఉన్న రష్యా కాన్వాయ్‌ను నాశనం చేయడంలో పోక్రాసా కీలక పాత్ర పోషించాడు.