2024 హీరో ప్లెజర్: ధర..స్పెసిఫికేషన్స్

2024 హీరో ప్లెజర్: ధర..స్పెసిఫికేషన్స్

చాలా తేలికైనది. నడపడం చాలా ఈజీ.. నచ్చిన రంగులు, డిజైన్లు, మంచి స్పీడ్ తో నడుస్తుంది. మొబైల్ ఛార్జింగ్ ఎంపిక కూడా ఉంది..తక్కువ  ధర.. బడ్జెట్ లో హీరో ప్లెజర్.. మహిళా రైడర్ల కోసం దీనిని తయారు చేశారు. BS6 లేటెస్ట్ మోడల్. 2024 హీరో ప్లెజర్.. దాని ముందు బైక్ ల మాదిరిగా ఉంది. అయితే కొత్త రంగులతో ఆకట్టుకుంటోంది. రెండు పెట్రోల్ వేరియంట్ లలో వస్తుంది. సెల్ఫ్ స్టార్ట్ డ్రమ్ బ్రేక్ లు, సెల్ప్ స్టార్ట్ డ్రమ్ బ్రేక్ అల్లాయ్ వీల్స్ తో వస్తోంది. 

డిజైన్ ఎలా ఉందంటే.. 

హీరో ప్లెజర్ డిజైన్ కొంత మేరకు మోడిఫై చేశారు. ఆప్రాన్, ఫ్రంట్ ఫెండర్ ఇండికేటర్లు, పొజిషన్ ల్యాంప్ ల నవీకరణ, హెడ్ ల్యాంప్ డిజైన్ రీడిజైన్ చేశారు. బాడీ డిజైన్ లో ఎలాంటి మార్పులు  చేయలేదు. ఇంధనం నింపే క్యాప్ ను టెయిల్ లో కాకుండా ట్రంక్ లో అమర్చారు.  ట్రిప్ మీటర్, ఫ్యుయెల్ గేజ్, స్పీడ్, సైడ్ స్టాండ్ ఇండికేషన్ కోసం స్పీడో మీటర్ ను అమర్చారు. 

హీరో ప్లెజర్ పనితీరు 

102 సీసీ ఇంజన్ తో నడిచే ఈ స్కీటర్ గరిష్టంగా 7.8 ఎన్ ఎమ్ గరిష్ట టార్క్, 6.7 బీహెచ్ పీ శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఇరువైపుల డ్రమ్ బ్రేక్ లు, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ తో స్కూటర్ బ్రేకింగ్ పనితీరు ఆకట్టుకుంటోంది. 

 హీరో ప్లెజర్ ఫీచర్స్ : 

  • హీరో ప్లెజర్ ఎయిర్ కూలింగ్, సింగిల్ సిలిండర్ డబుల్ వాల్వ్ 102.0 సీసీ ఇంజన్ తో సెల్ఫ్ స్టార్ట్ మెనికాజంతో అందుబాటులో ఉంది. 
  • ఈ స్కూటర్ లో కార్బ్యురేటర్ ఫ్యూయెల్ డెలివరీ మెకానిజం ఉంది. 
  • డ్రమ్ బ్రేక్ ల ద్వారా భ్రేకింగ్ సిస్టమ్ పర్ ఫెక్ట్ గా పనిచేస్తుంది. 
  • ఆకట్టుకునే మీటర్ కన్సోల్ ఉంది. 
  • సామాను పెట్టుకునేందుకు బూట్ లైట్ ఉంది 
  • ఇంధన గేజ్, పాస్ లైట్ ఉన్నాయి. 

హీరో ప్లెజర్ ధర రూ. 46వేల 100, రూ. 18వేల 100 మధ్య ఉంటుంది.