నెక్స్ట్ ఏంటీ?

V6 Velugu Posted on Jun 01, 2021

హీరోలందరూ వరుస సినిమాలు అనౌన్స్ చేసుకుంటూ పోతున్నారు. కానీ రామ్‌‌ చరణ్ మాత్రం కాస్త ఆచితూచి అడుగులేస్తున్నట్లే అనిపిస్తోంది. ఎందుకంటే ‘ఆర్‌‌‌‌ఆర్ఆర్’ స్టార్ట్‌‌ చేసిన చాన్నాళ్ల తర్వాత గానీ తన నెక్స్ట్ సినిమాని ప్రకటించలేదు చెర్రీ. తీరా అనౌన్స్ చేశాక శంకర్ ‘ఇండియన్ 2’ కాంట్రవర్శీలో చిక్కుకోవడంతో చెర్రీతో సినిమా చేస్తాడా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. శంకర్‌‌‌‌ ఆ సినిమా పూర్తి చేశాకే ఈ మూవీ స్టార్ట్ చేయాలి. అయితే ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌, ఆచార్య కొద్ది రోజుల్లో కంప్లీటైపోతాయి. అంటే చెర్రీకి కాస్త గ్యాప్ వచ్చే చాన్స్ ఉంది. అందుకే ఆ టైమ్‌‌లో తనో స్మాల్ మూవీ చేస్తే బెటరని ఫీలవుతున్నాడట. మంచి కాన్సెప్ట్ దొరికితే ఓ చిన్న సినిమా చేసేసి, శంకర్‌‌‌‌ ఫ్రీ అవ్వగానే ఆ మూవీలో జాయినయ్యేలా ప్లాన్ చేస్తున్నాడని టాక్. శంకర్​తో సినిమాపై ఆల్రెడీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇదొక పొలిటికల్ డ్రామా. చెర్రీ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు. ‘ఒకే ఒక్కడు’కి ఇది సీక్వెల్ అనే ప్రచారమూ జరుగుతోంది. మరోవైపు నిర్మాతగానూ చక్రం తిప్పుతున్నాడు చెర్రీ. ఆల్రెడీ ‘ఆచార్య’ను నిర్మిస్తున్నాడు. మలయాళ సూపర్‌‌‌‌ హిట్ ‘డ్రైవింగ్‌‌ లైసెన్స్’ని కూడా తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు. ఒరిజినల్‌‌లో పృథ్విరాజ్ చేసిన పాత్రలో పవన్‌‌ కళ్యాణ్‌‌ నటిస్తారని గతంలో వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు రవితేజ పేరు వినిపిస్తోంది. వీటన్నింటిపై క్లారిటీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి ఎవరైనా ముందుకొచ్చి వారి డౌట్స్ తీరుస్తారేమో చూడాలి.

Tagged ram charan, Movies, acharya, driving licence, RRR, tollywood, director shanker, Indian 2,

Latest Videos

Subscribe Now

More News