
హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ తీరాన జరుగుతోన్న ఈ కార్ రేసింగ్ కు పలువురు సెలబ్రిటీలు, వారి పిల్లలు భారీగా తరలివస్తున్నారు. హీరో రామ్ చరణ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తనయుడు, సూపర్ స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌతమ్ వచ్చారు. దీంతో నెక్లెస్ రోడ్ తో పాటు హుస్సేన్ సాగర్ ప్రాంతం అభిమానులతో సందడిగా మారింది. ఈ సందర్భంగా మాట్లాడిన రామ్ చరణ్ హైదరాబాద్ లో ఈ కార్ల రేస్ నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. తానెప్పుడు ఇలాంటి రేసింగ్ లకు బయటకు వెళ్లలేదన్నారు.
ఇవాళ సాయంత్రం 45నిమిషాల పాటు మెయిన్ రేస్ నిర్వహిస్తారు. ఈ సమయంలో18 మలుపులతో ఉన్న హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్‌లో 32 ల్యాప్స్ జరుగుతాయి. 45 నిమిషాల తర్వాత విన్నర్‌ను తేల్చేందుకు మరో ల్యాప్ నిర్వహిస్తారు. తక్కువ సమయంలో రేసును పూర్తి చేసిన వారు రౌండ్ 4 విన్నర్ అవుతాడు. అతనికి 25 పాయింట్లు దక్కుతాయి. తొలి పది స్థానాల్లో నిలిచిన వారికే పాయింట్లు లభిస్తాయి.