Ravi teja: రవితేజ మెడకు ఏమైంది?.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో

Ravi teja: రవితేజ మెడకు ఏమైంది?.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో

రవితేజ మెడకు ఏమైంది? హరీష్ శంకర్ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన రవి తేజ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు? మా హీరోకి ఏమైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. మాస మహారాజ రవితేజ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నారు. డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకు మీకీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. 

షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా సెట్స్ నుండి ఓ ఫోటో విడుదల చేశారు మేకర్స్. ఆ పిక్ లో రవితేజ మెడనొప్పితో బాధపడుతున్నట్లుగా కనిపిస్తున్నారు. ఆ ఫోటో షేర్ చేసి.. మాస్ మహారాజ రవితేజ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్. మెడ నొప్పితో బాధపడుతున్నా కూడా షూటింగ్ చేస్తున్నారు. థ్యాంక్యూ అన్నయ్య. ప్రతి రోజు మమ్మల్ని ఇన్‌స్పైర్ చేస్తూనే ఉంటారు.. అంటూ రాసుకొచ్చారు. 

 

దాంతో.. ఆ ఫోటో చూసిన రవితేజ ఫాన్స్ కంగారు పడుతున్నారు. అంత పెయిన్ గా ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు కదా అన్నా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే త్వరలో మిస్టర్ బచ్చన్ సినిమా విడుదల ఉన్న కారణంగా షూటింగ్ పోస్ట్ పోన్ కాకుండా ఉండటానికే నిప్పిని సైతం లెక్కచేయకుండా షూట్ లో పాల్గొంటున్నారట రవితేజ.. దీంతో ఆయన ఫ్యాన్స్ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. c