
కిరణ్ అబ్బవరం హీరోగా సుజీత్, సందీప్ తెరకెక్కించిన ‘క’ చిత్రం దీపావళికి విడుదలై పాజిటివ్ రెస్పాన్స్‌తో రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మూవీటీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. అతిథిగా హాజరైన హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘కిరణ్ కెరీర్‌ను మొదటినుంచీ చూస్తున్నా. మంచి సక్సెస్‌లు, అలాగే కొన్ని ఫెయిల్యూర్స్ చూశాడు. అవన్నీ తట్టుకుని ఈ చిత్రంతో మరోసారి సూపర్ హిట్ అందుకున్నాడు.తను ఎంతోమందికి ఇన్‌స్పిరేషన్. టీమ్ అందరికీ కంగ్రాట్స్’ అని చెప్పాడు.
మన టాలెంటే మనల్ని కాపాడుతుందని కిరణ్ ప్రూవ్ చేశాడు అని దిల్ రాజు అన్నారు. నిర్మాత బన్నీ వాస్, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి, దర్శకులు వశిష్ట, అనిల్ విశ్వనాథ్ ‘క’ సక్సెస్ పట్ల టీమ్‌ను అభినందించారు. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘నాకు సక్సెస్ కంటే నా జర్నీ ముఖ్యం. ఈ జర్నీనే సంతృప్తినిస్తోంది’ అని చెప్పాడు. ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ మర్చిపోలేనిది అన్నారు నిర్మాత చింతా గోపాలకృష్ణా రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.