సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా శనివారం థియేట్రికల్ రిలీజ్‌కు వచ్చి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోందని, రెండు రోజుల్లోనే రూ.3.96 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కించుకుందని టీమ్ చెప్పింది.
ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్‌లో సంతోష్ శోభన్ మాట్లాడుతూ ‘ఈ విజయం నాపై మరింత బాధ్యతను పెంచింది. థియేటర్స్ ముందు హౌస్‌ఫుల్ బోర్డ్స్ కనిపించాలి అనేది మా కల. అది ఈ చిత్రంతో నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది.
మంచి కథను హానెస్ట్‌గా తెరకెక్కిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ అయ్యింది’ అని అన్నాడు. ప్రీమియర్స్ నుంచే తమ మూవీకి మంచి రెస్పాన్స్ రావడం ఎంతో హ్యాపీనెస్ ఇచ్చిందని మానస వారణాసి చెప్పింది. ఈ సినిమాను సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కు దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్, ప్రొడ్యూసర్ అజయ్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని థ్యాంక్స్ చెప్పారు.
