
కొత్త తరహా కాన్సెప్టులు, డిఫరెంట్ రోల్స్‌తో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న సత్యదేవ్ (SatyaDev)..ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.వాటిలో ఒకటి ‘జీబ్రా’(Zebra). లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అనేది ట్యాగ్ లైన్. సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనుంజయ్ హీరోలుగా ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కిస్తున్న జీబ్రా మూవీ రిలీజ్ డేట్ ఖరారైంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంది. అయితే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మూవీ నుంచి విడుదల తేదీని లాక్ చేశారు మేకర్స్.
ఈ మూవీలో సత్య సూర్య అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ క్రమంలో సత్యదేవ్ స్పందిస్తూ.."నా కెరీర్‌లో అతిపెద్ద చిత్రాలలో జీబ్రా ఒకటి! ఈ అద్భుతమైన సమిష్టి తారాగణం మరియు మేకర్స్ తో భాగం కావడం ఆనందంగా ఉంది.ఈ దీపావళికి, మీకు సమీపంలోని థియేటర్‌లలో ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్ కానుంది..కలుద్దాం" అంటూ హీరో సత్య దేవ్ ట్వీట్ చేశాడు.
‘రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా,ఆర్థిక నేరాల నేపథ్యంలో క్రైమ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకి ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో సునీల్,గరుడ రామచంద్రరాజు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
ఓల్డ్ టౌన్ పిక్చర్ పై బాల సుందరం, దినేష్ సుందరంలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు,తమిళ,కన్నడ మలయాళ, హిందీ భాషల్లో జీబ్రా విడుదల కానుంది.
#ZEBRA - One of the biggest films of my career! Thrilled to be part of this incredible ensemble cast and crew.
— Satya Dev (@ActorSatyaDev) September 17, 2024
???? ??????? ??? ?????
This Diwali, Worldwide Grand Release at theatres near you on ??????? ????
A @RaviBasrur Musical @Dhananjayaka… pic.twitter.com/sl4DIA0K7d