గమనం నాకు చాలా స్పెషల్

గమనం నాకు చాలా స్పెషల్

‘చూసీ చూడంగానే’ సినిమాతో హీరోగా పరిచయమైన నిర్మాత రాజ్ కందుకూరి కొడుకు శివ.. ఇప్పుడు ‘గమనం’తో వస్తున్నాడు. శ్రియ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 10న రిలీజవుతోంది. ఈ సందర్భంగా శివ చెప్పిన సంగతులు. ‘‘చాలా స్పెషల్ సినిమా. కెరీర్‌‌‌‌ స్టార్టింగ్ స్టేజ్‌‌లోనే  ఇంత మంచి టెక్నీషియన్స్‌‌తో వర్క్ చేసే చాన్స్ రావడం నా అదృష్టం. స్టోరీ వినగానే కనెక్టయ్యాను. అప్పటికి నాకు ఇళయరాజా మ్యూజిక్ ఇస్తారని, జ్ఞానశేఖర్  సినిమాటోగ్రాఫర్ అనీ తెలీదు. తెలిశాక చాలా ఆనందపడ్డాను. ఇళయరాజా గారు సంగీతం అందించడం ఓ బ్లెస్సింగ్‌‌ అని ఫీలవుతున్నాను. ఇందులో మూడు డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. వాటిని కలుపుతూ ఒక లింక్ ఉంటుంది’ అని శివ అన్నారు.

‘ఈ మూవీలో అలీ అనే క్రికెటర్ పాత్ర నాది. చిన్నప్పుడు క్రికెట్ బాగా ఆడేవాడిని. అలవాటు తప్పిపోవడంతో రెండు నెలలు ట్రైనింగ్ తీసుకున్నా. తాత పాత్రతో ఉన్న ఎమోషన్   హైలైట్‌‌. నా తాతయ్యగా చారుహాసన్ నటించారు. ఆయన డెడికేషన్ సామాన్యమైనది కాది. తొంభయ్యేళ్లు పైబడినా అదే ఎనర్జీ. ఏ ఒక్కరోజూ సెట్‌‌కి లేట్‌‌గా వచ్చేవారు కాదు. జ్ఞానశేఖర్ కూడా కాంప్రమైజ్ అయ్యేవారు కాదు. అందరి కష్టం స్క్రీన్‌‌పై కనిపిస్తుంది. తక్కువ సినిమాలు చేసినా మంచివి మాత్రమే చేయాలనుకుంటున్నా. ‘మనుచరిత్ర’తో పాటు నాని ప్రొడక్షన్‌‌లో ‘మీట్ క్యూట్’ అనే వెబ్‌‌ ఫిల్మ్ చేస్తున్నాను. మరో రెండు సినిమాలకీ సైన్ చేశాను’ అని శివ చెప్పారు.