రజినీకాంత్ స్ఫూర్తితోనే సినిమాల్లోకి వచ్చా.. హీరో శివకార్తికేయన్

రజినీకాంత్ స్ఫూర్తితోనే సినిమాల్లోకి వచ్చా.. హీరో శివకార్తికేయన్

కోలీవుడ్‌ టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్(Shivakarthikeyan) లేటెస్ట్ మూవీ మావీరన్(Maveeran). ఈ సినిమా తెలుగులో మహావీరుడు(Mahaveerudu) పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జులై 14న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ తెచ్చుకుంది. లేటెస్ట్ గా మూవీ సక్సెస్ కు సంబంధించి సూపర్ స్టార్ రజినీకాంత్ మావీరన్‌ చిత్ర టీంను మెచ్చుకున్నారు. 

ఈ సందర్భంగా శివకార్తికేయన్‌ తన ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసి రజినీకు థాంక్స్ చెప్పారు. రజినీ కొన్నాళ్లుగా జైలర్‌ మూవీ ఆడియో , రిలీజ్ ప్రొమోషన్స్ తో బిజీగా ఉండగా..మావీరన్‌  మూవీని చూడలేకపోతానని అనుకున్నాను..కానీ లేటెస్ట్ గా ఈ మూవీ చూసానని..అని రజినీ వెల్లడించిన విషయం షేర్ చేసుకున్నారు శివ కార్తికేయన్. ఆయన స్ఫూర్తితోనే తాను రంగంలోకి ప్రవేశించినట్లు శివ కార్తికేయన్ చెప్పుకొచ్చారు

అలాగే  మావీరన్‌ మూవీను బాగా ఎంజాయ్‌ చేశానని, చాలా గ్రాండ్‌గా, సూపర్బ్‌గా ఉందంటూ రజినీ మెచ్చుకున్నట్లు వీడియో ద్వారాహీరో పంచుకున్నారు. రొటీన్ మూవీస్ కాకుండా..చాలా డిఫరెంట్‌ కథా చిత్రాలను ఎంచుకుంటున్న శివకార్తికేయన్ ను రజినీ  అభినందించడం పట్ల హీరో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. 

రజినీకాంత్ బిజీ షెడ్యూల్లో కూడా..వేరే హీరోస్ మూవీస్ చూసి విషెస్ చేయడం పట్ల ఇండస్ట్రీ నుంచి, ఫ్యాన్స్ నుంచి గ్రేట్ రజినీ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తోన్నాయి. ఇక రజినీ నుంచి ప్రస్తుతం రిలీజ్ అయినా జైలర్ వసూళ్ల సునామి క్రియేట్ చేస్తోంది. ఫస్ట్ డే నే వరల్డ్ వైడ్ గా రూ.124 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక శివ కార్తికేయన్ నటిస్తున్న కొత్త చిత్రం అయలాన్‌‌‌‌. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.