పాన్ ఇండియా భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది రష్మిక మందన్న. ఇందులో భాగంగా ఇవాళ (24 డిసెంబర్ 2005న) తన కొత్త సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ‘మైసా’ (Mysaa) అనే ఆసక్తికర టైటిల్తో తెరకెక్కనున్న ఈ సినిమా గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్.
ఈ సందర్బంగా విడుదల చేసిన గ్లింప్స్తో అంచనాలు పెంచారు మేకర్స్. మునుపెన్నడూ కనిపించని సరికొత్త పాత్రలో రష్మిక దర్శనమిచ్చింది. గిరిజన తిరుగుబాటు యువతిగా, ప్రతీకార భావంతో నిండిన పాత్రలో రష్మిక కనిపించిన తీరు ఆకట్టుకుంటోంది. వాయిస్ ఓవర్‌లో వినిపించే ఇంటెన్స్ డైలాగులు, పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.“నా బిడ్డ ఊపిరి మోయలేక అగ్గే బూడిదైంది.. నా బిడ్డను సంపలేక ఆఖరికి సావే సచ్చిపోయింది” అనే డైలాగులు పాత్రలోని కోపాన్ని తీవ్రంగా ప్రతిబింబిస్తున్నాయి.
‘‘ఎప్పుడూ అడుగుపెట్టని ప్రపంచం ఇది.. ఇప్పటివరకు కలవని తన వెర్షన్. ధైర్యం ఆమె బలం. సంకల్పంలో లేదు కనికరం.. ఆమె గర్జన వినడానికి కాదు.. భయపెట్టడానికి’’..! అంటూ నిర్మాణసంస్థ అన్‌ఫార్ములా ఫిల్మ్స్ శక్తివంతమైన క్యాప్షన్ ఇచ్చింది.
అంతేకాకుండా ‘‘ ప్రతి ఆటంకానికి ఎదురుగా, ఆమె పైకి లేస్తుంది. మౌనానికి వ్యతిరేకంగా, ఆమె గర్జిస్తుంది. ప్రపంచానికి ఎదురుగా, ఆమె ఒంటరిగా నిలబడుతుంది. ఆ పేరునుగుర్తుంచుకోండి.. ఆమె మైసా’’ అని తెలిపింది. రవీంద్ర పూలే డైరెక్ట్ చేసిన ఈ మూవీ పాన్ ఇండియా భాషల్లో తెరకెక్కింది. ‘మైసా’ అనే పదానికి “అమ్మ” అనే అర్థం. 2026లో మైసా ప్రేక్షకుల ముందుకు రానుంది.
రష్మిక మందన్న గత నాలుగేళ్లుగా బాక్సాఫీస్ దగ్గర వరుస బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకుంటుంది. యానిమల్, పుష్ప 2, ఛావా, కుబేర, ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాలతో మంచి సక్సెస్ జోష్లో ఉంది. తెలుగులోనే కాదు ఇండియాలోనే ఏ హీరోయిన్కు సాధ్యం కాని రికార్డ్ కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం రష్మిక చేతిలో 'రెయిన్‌బో' మరియు 'పుష్ప 3' మూవీస్ తో పాటుగా మరిన్ని లైన్లో ఉన్నాయి.
The world will remember her name 🔥#MYSAA the first glimpse on 24.12.25 ❤️🔥#RememberTheName@RawindraPulle @jakes_bejoy @kshreyaas #AndyLong @unformulafilms #SaiGopa @AjaySaipureddy #AnilSaipureddy @srikanthsathi10 @TSeries @tseriessouth pic.twitter.com/WPLwEKYq9a
— Rashmika Mandanna (@iamRashmika) December 21, 2025
